శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 జులై 2019 (17:24 IST)

తుపాకీ పట్టుకుని స్టెప్పులేసిన ఎమ్మెల్యే.. వేటుకు రంగం సిద్ధం

ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మద్యం మత్తులో తుపాకీతో స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో తుపాకీ పట్టుకుని తప్పతాగి స్టెప్పులేసిన ఎమ్మెల్యేపై బీజేపీ యాజమాన్యం పార్టీ నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది.


ఉత్తరాఖండ్ జిల్లాకు చెందిన ప్రణవ్ సింగ్ మీడియా ప్రతినిధులను బెదిరించి.. దాడికి ప్రయత్నించినట్లు గత నెలలో పార్టీ నుంచి మూడు నెలల పాటు తాత్కాలిక నిషేధానికి గురైయ్యాడు.
 
ఈ నేపథ్యంలో తన కాలికి ఇటీవల శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఇంటికి తిరిగిన ప్రణవ్ సింగ్.. తన అనుచరులకు తాను క్షేమంగా ఇంటికి చేరుకున్నాననే విషయాన్ని తెలియజేసే దిశగా మద్యం సేవించి.. తుపాకీ పట్టుకుని స్టెప్పులేశాడు. 
 
ప్రముఖ బాలీవుడ్ పాటకు చిందులేసిన ప్రణవ్ వీడియో నెట్టింట వైరలై కూర్చుంది. ఇంకా చేతిలో తుపాకీతో పాటు.. మద్యం మత్తులో చిందేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ అగ్రస్థానం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ నేత శ్యామ్ జాజూ మాట్లాడుతూ.. ప్రణవ్ సింగ్‌ను బీజేపీ నుంచి శాశ్వతంగా తొలగించాల్సిందిగా సిఫార్సు చేసినట్లు తెలిపారు.