శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 జులై 2019 (17:17 IST)

ఆర్మీ జవాన్ మృతి.. గ్రామంలో విషాద ఛాయలు

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేని పల్లి గ్రామానికి చెందిన తమ్మినేని అశోక్ కుమార్ జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీలో విధులు నిర్వహిస్తూ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన సమాచారం మేరకు విధి నిర్వహణలో భాగంగా గత రెండు రోజుల క్రిందట అశోక్ తెల్లవారుజామున ఫస్ట్ టర్మ్ డ్యూటీ ముగించుకొని సెకండ్ టర్మ్ డ్యూటీకి వెళ్లే ప్రయత్నంలో తన తుపాకీ మిస్ ఫైర్ అయి మెడకు కింద భాగాన బులెట్ దూసుకొని వెళ్లడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడని తెలిపారు. 
 
అయితే అశోక్ చిన్నప్పటి నుండి దేశ సేవ చేయాలని చాలా ఆకాంక్షతో ఉండే వాడని తన తండ్రి కూడా ఆర్మీలో విధులు నిర్వహించి రిటైడ్ ఐయ్యడాని. తన తండ్రి ప్రోత్సాహంతోనే దేశ సేవకై రెండు సంవత్సరాల క్రితం ఆర్మీలో జాయిన్ ఐయ్యడాని అశోక్‌కి ఇంకా పెళ్లి కూడా కాలేదని ఇంతలోనే ఇంతటి ఘోరం జరిగిందని అశోక్ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అశోక్ పార్థివదేహం బుధవారం ఉదయం 7:30 నిమిషాలకు తన స్వగ్రామం అర్దవీడు మండలం పాపినేనిపల్లెకు చేరడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.