ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 జులై 2019 (06:54 IST)

జగన్ ఇంటి వద్ద వెల్లువెత్తిన ధర్నాలు.. పోలీసులు ఏం చేశారో చూడండి

తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసం వద్ద ధర్నాలు పెరిగి పోతుండడంతో పోలీసులు బేజారెత్తిపోతున్నారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఆఖరి అస్త్రంగా గుంటూరు రూరల్ మొత్తం ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించారు.
 
గుంటూరు అర్బన్ పరిధిలో 30 పోలీస్ చట్టము అమలులో ఉన్నది.  తాడేపల్లి పట్టణంతో సహా మిగిలిన గుంటూరు అర్బన్ పరిధిలో ఎలాంటి  చట్ట బద్ధమైన అనుమతులు లేకుండా నిరసనలు ధర్నాలు వగైరా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం లేదు.
 
 తాడేపల్లిలోని ముఖ్యమంత్రి గారి నివాసం వద్ద చౌకధరల దుకాణ దారులు (రేషన్ షాప్ డీలర్స్) తమ కోర్కెల కోసము నిరసనలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తున్నట్లు గా తమ దృష్టికి వచ్చినట్లు,ఇట్టి కార్యక్రమాలు నిర్వహించుటకు వారికి సంబంధిత అధికారులు నుండి ఎలాంటి అనుమతులు పొందలేదు.

తగిన అనుమతులు లేకుండా  ధర్నాలు వగైరా నిరసన కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్టప్రకారం కేసులు నమోదుచేసి, కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుందని,  కనుక చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు ఎవరు హాజరు కావడం గానీ మద్దతు తెలపడం చేయరాదని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలియ జేసినారు.