బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (12:07 IST)

ఫ్రెంచ్ గడ్డం - యంగ్ లుక్‌లో బాలకృష్ణ.. నందమూరి ఫ్యాన్స్ సంబరాలు

నందమూరి బాలకృష్ణ న్యూ లుక్‌లో కనిపించారు. ఫ్రెంచ్ గడ్డంతో సరికొత్త అదుర్స్ అంటూ నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఎన్డీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అనే రెండు చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. 
 
ఇపుడు బాలయ్య తన 105వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. థాయ్‌లాండ్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రమిది. గడ్డం, మీసం ఉన్న లుక్‌లో బాలయ్యను చూసి థ్రిల్ అవుతున్నారు. మంగళవారం నుంచి లోకల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సినిమాలో కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు.
 
సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు. ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 'జైసింహా' తర్వాత బాలకృష్ణ, సి.కల్యాణ్, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది.
 
ఈ నేపథ్యంలో బాలయ్య కొత్త లుక్‌లో కనిపించారు. ఫ్రెంచ్ గడ్డంతో ఆయన ఉన్న ఫోటోను హరికృష్ణ కుమార్తె సుహాసిని తన ఫేస్‌బుక్ ఖాతాలో పంచుకోగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. "బాలా బాబాయ్ కొత్త లుక్ ఆయన వయసుని ఒక 30 ఏళ్ళు తగ్గించింది. ఆయనకి ఆయనే సాటి..." అని ఆమె క్యాప్షన్ పెట్టారు. ఈ లుక్ బాలకృష్ణ తాజా చిత్రంలోనిది అయివుంటుందని బాలయ్య ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.