10-09-2019- మంగళవారం దినఫలాలు - స్త్రీలకు పనివారితో...

astro 5
రామన్| Last Updated: మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (09:29 IST)
మేషం: ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రముఖులతో పరిచయాలు అనుకోని విధంగా జరుగుతాయి. బ్యాంకు వ్యవహారాలలో చికాకులను ఎదుర్కొంటారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు.

వృషభం: శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పనివారితో సమస్యలు అధికమవుతాయి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. కుటుంబీకుల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. బంధువుల ఇంటశుభసందర్భాల్లో కీలకపాత్ర వహిస్తారు.

మిధునం: రచయితలకు, పత్రికా రంగాల వారికి అనుకూలమైన కాలం. చేపట్టిన పనులలో నాణ్యతా లోపం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. ఉన్నతోద్యోగం లభించే
అవకాశం ఉంది.

కర్కాటకం: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రిప్రజెంటేటివులకు సంతృప్తి కానవస్తుంది. ఒక పుణ్యక్షేత్ర సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.

సింహం: కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రసాయనిక, మందులు, ఎరువులు, సుగంధద్రవ్య వ్యాపారస్తులకు కలిసివస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.

కన్య: మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగ రీత్యా దూరప్రయాణం చేయవలసివస్తుంది. ప్రముఖుల కలయిక మీ పురోభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వ రంగాలలో వారికి సమస్యలు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్యము కుదుటపడుతుంది. హోటల్ తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

తుల: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. ఉద్యోగస్తులకు చేసే పని యందు ధ్యాస వహించటంమంచిది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఇబ్బందులెదుర్కుంటారు. ఆకస్మకంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.

వృశ్చికం: వైద్యులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తాయి. స్త్రీలకు చుట్టుప్రక్కల వారి నుండి గుర్తింపు లభిస్తాయి. మీ మాటలు కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం మంచిది. అనుకున్న మొత్తం చేతికందుతుంది.

ధనస్సు: స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఆశాజనకం. మీ లక్ష్యం పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. నిరుద్యోగులు ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం వల్ల మాటపడతారు. వైద్యులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి.

మకరం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులకు ఆర్థిక సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. వృత్తుల్లో తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయటం మంచిది. రవాణా రంగాల వారికి ఆందోళనలు అధికమవుతాయి. దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.

మీనం: విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటివ్‌లకు అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. బ్యాంక్ పనులు మందకొడిగా సాగుతాయి.



దీనిపై మరింత చదవండి :