శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (15:43 IST)

08-09-2019 ఆదివారం దినఫలాలు - రాజకీయ పరిచయాలు లబ్ధిని...

మేషం: విదేశీయ వస్తువులు పట్ల ఆకర్షితులవుతారు. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ట్రాన్స్‌‌పోర్టు, ట్రావెలింగ్ ఏజెంట్లకు సదవకాశాలు లభిస్తాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు.
 
వృషభం: మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రేమికులకు నిదానం అవసరం. అందరితో  కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. మీ సంతానం కోసం ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. స్త్రీలకు దైవ, పుణ్య, శుభ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మిధునం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. రాజకీయ పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. బంధుమిత్రుల కలయిక మీకెంతో సంతృప్తి నిస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. రోజులు, భారంగాను, విసుగ్గానుసాగుతాయి. 
 
కర్కాటకం: రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత చాలా అవసరం. పెద్దల ఆరోగ్యములో జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు చేయడం క్షేమదాయకం కాదు. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.
 
సింహం: ఉద్యోగస్తులకు ఇతరుల కారణంగా మాటపడక తప్పదు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో మెళుకువ అవసరం. పాత రుణాలు తీరుస్తారు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. దంపతుల మధ్య రహస్యాలు దాచడం వల్ల విభేదాలు తలెత్తుతాయి. ప్రముఖుల పరిచయం మీ ఉన్నతికి దోహదపడుతుంది.
 
కన్య: సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు. దూర ప్రయాణాలలో నూతన వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల జాగ్రత్త అవసరం.
 
తుల: భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. కాంట్రాక్టర్లకు చేతిలోపని పూర్తి కావడంతో ఒకింత కుదుటపడతారు. వాతావరణంలోని మార్పు ఆందోళన కలిగిస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
వృశ్చికం: కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చినధనం మరొక అవసరానికి వినియోగిస్తారు. బంధువుల ఆకస్మిక రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి.
 
ధనస్సు: స్త్రీలకు బంధువుల రాక వల్ల పనులో ఆటంకాలు తలెత్తుతాయి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. విద్యార్థులు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మకరం: స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. నిరుద్యోగులు రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల మధ్య రహస్యాలు దాచడం వల్ల విభేదాలు తలెత్తవచ్చు. స్త్రీలకు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ప్రయాణాల ముఖ్యోద్దేశ్యం నెరవేరుతుంది.
 
కుంభం: ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిదని గమనించండి. మత్స్య, కోళ్ళ, గొఱ్ఱె వ్యాపారస్తులకు అనుకూలం. విద్యార్థులు రాజకీయ విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఇతరుల గురించి హాస్యానికి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మవుతాయి.
 
మీనం: తలపెట్టిన పనులు ఏ మాత్రం ముందకు సాగవు. బంధువుల రాకతో మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. కుటుంబీకులతో కలిసి సరదాగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. ఏ వ్యక్తినీ తక్కువగా అంచనా వేయటం మంచిది కాదు.