మేషం: మీ యత్నాలకు కొంతమంది భంగం కలిగించవచ్చు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ధనవ్యయం విపరీతంగా ఉన్నా ప్రయోజనం, సార్థకత ఉంటాయి. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది అప్రమత్తత అవసరం.
వృషభం: ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య సానుకూలమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ట్రాన్సుపోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. శారీరకశ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
మిథునం: ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మిల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఏజెంట్లకు, రిప్రజెంటేటివ్లకు ఒత్తిడి పెరుగుతుంది.
కర్కాటకం: ఆర్థికంగా బాగా స్థిరపడతారు. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది అప్రమత్తత అవసరం. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.
సింహం: ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ సంతానం మెుండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం.
కన్య: దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ప్రముఖుల కలయిక, బ్యాంకు వ్యవహారాలు ఒక పట్టాన పూర్తి కావు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
తుల: రోజువారీ ఖర్చులే ఉంటాయి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. క్రీడలపట్ల నూతన ఉత్సాహం కానవవస్తుంది. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ఏజెంట్లకు రిప్రజెంటేటివ్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు.
వృశ్చికం: స్త్రీల ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. దూర ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
ధనస్సు: నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. బంధు మిత్రులతో విభేదాలు తీరుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
మకరం: దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులకు కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతాయి.
కుంభం: ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. బందువుల రాకతో కుటుంబంలో ఉల్లాసం, సంతోషం కానవస్తుంది.
మీనం: మీ జీవితభాగస్వామి వైఖరి చికాకు కలిగిస్తుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహాయం లభించక ఆందోళన చెందుతారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వాహనచోదకులకు మెళకువ అవసరం. మీ కార్యక్రమాలు బంధువుల రాకతో మార్చుకోవలసి ఉంటుంది.