1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. General Characteristics of Mesha Rasi/Aries Ras

మేషరాశి జాతకులకు కోపం ఎక్కువ.. భాగస్వామితో ఎలా వుంటారంటే?

మేషరాశి.. 12 రాశుల్లో మొదటిది. ఈ రాశిలో పుట్టిన వారికి అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వర్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన జాతకులు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు. సమాజంలో వీరి నిజాయితికి తగిన ఉన్

General Characteristics
మేషరాశి.. 12 రాశుల్లో మొదటిది. ఈ రాశిలో పుట్టిన వారికి అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వర్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన జాతకులు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు. సమాజంలో వీరి నిజాయితికి తగిన ఉన్నత స్థానం కలిగివుంటుంది. తెలివితేటలకు ఏమాత్రం లోటుండదు. ఈ జాతకులకు ఆస్తులుంటాయి. వ్యవసాయ భూములు వుంటాయి. ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది.
 
మంచి స్నేహితులున్నా.. శత్రువులు కూడా వెన్నంటి వుంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకే ఆగ్రహానికి గురికావడంతో.. చిన్న చిన్న సమస్యలను పెద్దదిగా చూడటం వీరి నైజం. ఆధ్యాత్మిక చింతన వీరికి మెండుగా ఉంటుంది. బంగారం, దుస్తులు, ఆభరణాలు కొనడంలో ముందుంటారు. ఉన్నత చదువులు అభ్యసిస్తారు. ఇతరులను ఆకట్టుకునే నైజం వీరి సొంతం. 
 
ఇతరులకు ఆకట్టుకునే రీతిలో వీరి శరీరాకృతి వుంటుంది. ఈ జాతకంలో జన్మించిన జాతుకులు 26వ ఏట నుంచి శుభఫలితాలను ఆశించవద్దు. ముక్కుసూటిగా మాట్లాడటం, నిజాయితీగా వ్యవహరించడం, నిరంతర కృషి చేస్తారు. శరీరకపరంగా బలవంతులుగా ఉంటారు. ఆత్మగౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. వృషభం,  కృత్తికా నక్షత్రంలో జన్మించిన జాతకులు వైద్యులుగా రాణిస్తారు. భాగస్వాములతో అన్యోన్యత కలిగివుంటారు. సంతానం భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
About Writer
Selvi
తర్వాతి కథనం
అన్న ఇంటిని తమ్ముడు కొనచ్చా?