సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (17:53 IST)

నూనె తాగినట్లు కలవస్తే తీపి వ్యాధి వస్తుందట..

Oil
ఎర్రని పూలదండలూ, వస్త్రాలలో స్త్రీ పురుషుల కానవస్తే రక్త సంబంధిత రోగాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. భూత ప్రేత పిశాచులు వస్తే జ్వరం వస్తుందని.. దున్నపోతులు, శునకాలు, గాడిదలు దిక్షణ దిక్కుకు వెళ్తున్నట్లు కలవస్తే.. ఊపిరితత్తుల సంబంధిత వ్యాధులు వస్తాయి. రాక్షసులు, నీటికి సంబంధించిన కలలు వస్తే.. పిచ్చిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. 
 
నూనె తాగినట్లు కలవస్తే తీపి వ్యాధి వస్తుందని సూచన. చంద్ర సూర్య గ్రహణాలు వచ్చినట్లు కలవస్తే కంటి వ్యాధులు వస్తాయి. నల్లనిధి, భయంకర ముఖాలు కలిగిన వారు కలలోకి వస్తే ఎంతో జాగ్రత్తగా వుండాలని హెచ్చరించినట్లు అవుతుంది. 
 
అలాగే గాలిలో ఎగిరినట్లు కల వస్తే ఆస్తినష్టం. అలాగే దేవతలూ, గోవులూ, అగ్ని, సరస్సులు, కన్యలు, ఫలములు, పర్వతాలు, నదులు సముద్రాలు దాటటం వంటివన్నీ ధనాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించే సూచికలు. శవాన్ని చూసినట్లు కల వస్తే కష్టాలు ముందున్నాయని సూచికలు.