గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:21 IST)

తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈనెల 25వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించింది టిటిడి.
 
సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేశారు టిటిడి సిబ్బంది. ఆలయం లోపల జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. 
 
ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయాలను శుద్ధి చేస్తున్నారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఆలయంలో తక్కువ సిబ్బందితోనే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. తిరుమంజనం కారణంగా భక్తుల దర్సనాన్ని కాసేపు నిలిపివేశారు. తిరిగి ఉదయం 11.45 గంటల నుంచి సర్వదర్సన భక్తులను దర్సనానికి అనుమతిస్తున్నారు టిటిడి అధికారులు.