సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి వస్తుందంటే హైదరాబాద్ నగరం నుంచే కాక దేశంలోని వివిధ నగరాల నుంచి తెలుగు రాష్ట్రాల పల్లెలకి తెలుగువారు ప్రయాణం చేస్తుంటారు. ఈ నేపధ్యంలో దక్షిణమధ్య రైల్వే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమయ్యింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ఈ రైళ్లు నడవనున్నాయి.
డిశెంబర్ 23 నుంచి జనవరి 27 వరకూ సికింద్రాబాద్-పార్వతీపురం ప్రత్యేక రైలు ప్రతి బుధవారం నడుస్తుంది. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, గంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం మీదుగా వెళ్తుంది. అలాగే జనవరి 10, 12, 17, 19 తేదీల్లో చర్లపల్లి-నర్సాపూర్ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. అలాగే నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా రాకపోకలు సాగించనున్న రైళ్ల తేదీలు వెల్లడి కావాల్సి వుంది.

