1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Powerful Remedy for All Types of Drishti Dosha

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

turmeric
నరదృష్టితో ప్రతికూల ప్రభావాలు అధికమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కంటి దృష్టి చేపట్టిన కార్యాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. నరదృష్టిని పోగొట్టుకోవాలంటే మంగళ, ఆదివారాల్లో పెద్దల చేత దిష్టి తీయించుకోవడం చేయాలి. కర్పూరంతో, ఉప్పు, మిరపకాయలు, నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయతో దిష్టి తీయించుకోవడం ద్వారా నరదృష్టితో ఏర్పడే ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. 
 
ఇంకా నరదృష్టిని తొలగించుకోవాలంటే.. నుదుట పసుపుతో తిలకం పెట్టుకోవాలి. ఇది నరదృష్టితో ఏర్పడే ఇబ్బందులను దరిచేరనివ్వదు. అలాగే నుదుట కాటుకతో బొట్టు పెట్టుకోవడం కూడా నరదృష్టి ఎఫెక్టును తగ్గిస్తుంది. చెవులకు వెనుక భాగంలో కాటుకతో బొట్టు పెట్టుకోవడం కూడా నరదృష్టితో ఏర్పడే ఇబ్బందులను పటాపంచలు చేస్తుంది. ఇంకా రుద్రాక్షను ధరించడం దుష్టశక్తులను దరిచేర్చదు. 
Katuka
Katuka
 
ఇంకా నరదృష్టికి చెక్ పెట్టాలంటే ఇంటి ముందు రోజా పువ్వు మొక్కలను పెంచడం చేయాలి. దిష్టిబొమ్మలను తగిలించడం చేయాలి. గుమ్మడికాయలు, స్పటికం నిమ్మకాయ వంటి దిష్టిని తొలగించే వస్తువులను ఇంటి ముందు వేలాడదీయడం చేయొచ్చు. ఇల చేస్తే ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. తద్వారా విజయావకాశాలు మెరుగవవుతాయి. 
తర్వాతి కథనం
07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...