1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Shiva Mantra To Remove Sins Of Seven Janmas

ఏడు జన్మల పాపాలను, కర్మలను తొలగించే శివ నామాల గురించి తెలుసా?

Shiva Mantras
Shiva Mantras
శివ మంత్రాలు ఆధ్యాత్మిక శాంతి, మనోధైర్యం, ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైన ఓం నమః శివాయ, మహా మృత్యుంజయ మంత్రం ప్రతికూల శక్తులను నాశనం చేసి, ఒకరి జీవితంలో శుభప్రదమైన మార్పులను తీసుకురాగలవు. మంత్రాలను ఉచ్చరించేటప్పుడు కలిగే ప్రకంపనలు మనస్సును ఏకాగ్రపరచి ఒత్తిడిని తొలగిస్తాయి. తెలియక చేసిన పాపాలు, శాపాలు, దోషాలు తొలగిపోవడానికి శివారాధన సహాయపడుతుంది. 
 
శరీరానికి నూతనోత్తేజాన్ని, అడ్డంకులను, ప్రతికూలతలను జయించే ధైర్యాన్ని ఇస్తుంది. శివుని మంత్రాలను నమ్మకంతో ఉచ్చరించడం, ధ్యానించడం అన్ని విధాల ప్రయోజనాలను ఇస్తుంది. శివుడు అంటేనే ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అయితే కొన్ని శివ మంత్రాలు వాటిని ఉచ్చరించే సంఖ్య, స్థలం, సమయం, ఉచ్చరించే విధానాన్ని బట్టి దానికి తగిన ఫలితాలను ఇస్తాయి. 
 
సాధారణంగా ఏ మంత్రమైనా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త వేళ, సాయంత్రం సంధ్యా కాల వేళల్లో జపించడం చాలా శ్రేష్ఠం. అదేవిధంగా ఇతర ప్రదేశాలలో కూర్చుని శివ మంత్రాలను చెప్పడం కంటే, పురాతన శివాలయాలకు వెళ్లి, అక్కడ శివ సన్నిధి ఎదుట కూర్చుని, బహిరంగ ప్రదేశంలో కూర్చుని ఉచ్చరించడం ఆధ్యాత్మిక శక్తిని పెంచి, మనకు అపారమైన ప్రయోజనాలను కలిగిస్తుంది.
 
ప్రతిరోజూ మంత్రాలను చెబుతున్నా ఫలితం రావడం లేదని కొన్ని మంత్రాలను తప్పుపట్టడం జరుగుతుంది. నిజానికి, మనం చేసే మంత్ర జపానికి తగిన ఫలితం రాకపోవడానికి కారణం, మనం చేసిన పాపాలు, మనల్ని వెంటాడే కర్మలే. కర్మలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి మంత్రమైనా, దాన్ని ఎన్నిసార్లు చెప్పినా ఫలితం రాదు. 
 
అందువల్ల ముందుగా పాపాలను పోగొట్టే శివ మంత్రాలను ఉచ్చరించడం విశేషం. శివుని యొక్క ఒకే ఒక్క సులభమైన మంత్రాన్ని చెప్పడం అవసరం. ఈ మంత్రాన్ని మనం ఒక్కసారి పురాతన శివాలయంలో జపిస్తే, మనం చేసిన పాపాలు తొలగిపోతాయి. అంటే మన భర్త లేదా భార్య, మన పూర్వీకులైన తల్లిదండ్రులు, వారి పూర్వీకులు అనే 7 తరాల, సుమారు 267 దంపతులు చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్మకం.
 
"ఓం శ్రీ సోమనాథేశ్వరాయ నమః 
ఓం శ్రీ మల్లికార్జునేశ్వరాయ నమః"ఈ మంత్రాన్ని శివాలయానికి వెళ్లి ప్రతిరోజూ జపించవచ్చు. అలా చేయలేని వారు శివారాధనకు అత్యంత శ్రేష్ఠమైన మాస శివరాత్రి, ప్రదోషం వంటి రోజుల్లో శివుడిని మనసారా ధ్యానించి, ఈ మంత్రాన్ని చెప్పవచ్చు. అది మరింత త్వరగా ఫలితాలను ఇస్తుంది. 
 
శివ సన్నిధిలో దీపం వెలిగించి, మారేడు దళాలను శివలింగానికి సమర్పించి, శివ సన్నిధి ఎదుట కూర్చుని ఈ మంత్రాన్ని నిరంతరం ఉచ్చరించడం వల్ల శివుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందవచ్చు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
శుక్ర ప్రదోష వ్రతం.. శివుని అభిషేకాన్ని దర్శిస్తే.. ఏంటి ఫలితం?