Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 30 గంటలు
Tirumala
తిరుపతి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ మొదలుకొని, తిరుపతిలోని దేవస్థాన సత్రాలు, ఆలయాలు, ఘాట్ రోడ్లు, అన్నదాన భవనం, తలనీలాలు సమర్పించే ప్రదేశం, లడ్డూ ప్రసాద వితరణ కేంద్రం, వసతి గదులు జారీ చేసే ప్రదేశం, దర్శనాలకు వెళ్లే అన్ని మార్గాల్లోనూ భక్తులు బారులు తీరి వెళ్లడం కనిపిస్తోంది.
తరలివస్తున్న సామాన్య భక్తుల కోసం తిరుపతి దేవస్థానం వీఐపీ బ్రేక్ దర్శనం, ఇతర ప్రత్యేక దర్శన విధానాలను రద్దు చేసినప్పటికీ, అదుపు లేకుండా భక్తులు తిరుమల వైపు వస్తూనే ఉన్నారు. దీని కారణంగా సర్వదర్శనానికి శుక్రవారం 30 గంటల వరకు సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
