1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
  4. Makar Sankranti 2023: Know The Dos and Don'ts For The Festival

మకర సంక్రాంతి రోజున నాన్ వెజ్ ఆహారాన్ని తీసుకోవచ్చా?

Pongal
Pongal
మకర సంక్రాంతి రోజున స్నానం తర్వాత ఆహారం తీసుకోవాలి. సాయంత్రం పూట రాత్రి వేళలో ఆహారం తీసుకోకూడదు. మకర సంక్రాంతి పర్వదినాన మిగిలిపోయిన ఆహారం తీసుకోకూడదు. అలా తీసుకుంటే ప్రతికూల శక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయని చెప్తుంటారు. తద్వారా కోపం కూడా అధికమవుతుంది. 
 
మకర సంక్రాంతి పర్వదినాన ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ ఆహారాన్ని తీసుకోకూడదు. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలను తమ ఆహారంలో తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఆకుకూరలు, శాకాహారం తీసుకోవాలి. 
 
సంక్రాంతి రోజున చెట్ల నీరుపోయడం చేయొచ్చు. చెట్లను నరకకూడదు. ప్రకృతికి హాని కలిగించకూడదు. పేదలకు దానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి.
 
మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాపం నుండి విముక్తి, మోక్షం లభిస్తుంది. గంగా స్నానం ఉత్తమం. మకర సంక్రాంతి రోజున, ప్రతి ఒక్కరూ తన పూర్వీకుల పేరిట తర్పణం చేయాలి. ఈ కారణంగా ఇంట్లో పితృదోషం తొలగిపోతుంది. ఈ రోజున, మహారాజ్ భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలకు శాంతి కోసం గంగానదిలో తర్పణం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. 
తర్వాతి కథనం
మకర సంక్రాంతి: నువ్వులు, ఆవు నెయ్యిని దానం చేస్తే..