సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (15:22 IST)

మకర సంక్రాంతి ముగిసింది.. శబరిమల ఆలయం మూసివేత

కేరళ శబరిమలలో మకర సంక్రాంతికి అనంతరం వారం వ్యవధిలో ఆలయాన్ని మూసివేస్తారు. కుంభ నెల పూజల నిమిత్తం ఆలయాన్ని తిరిగి ఫిబ్రవరి 12న సాయంత్రం 5:30 గంటలకు తెరవనున్నారు. 
 
దీంతో శాస్త్రోక్తంగా అయ్యప్ప దేవాలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవసం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి ఏటా.. కార్తీకమాసంలో ఆలయాన్ని తెరిచి భక్తులకు, అయ్యప్ప స్వాములకు దర్శనం కల్పిస్తారు. 
 
ఫిబ్రవరి నెలలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా ఆలయ అధికారిక వెబ్ సైట్‌లో డేట్లు సరిచూసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
 
కాగా ఆలయం మూసివేత సందర్భంగా రాజకుటుంబీకులు మూలం తిరున్నాల్ శంకర్ వర్మ.. గురువారం ఉదయం గణపతి హోమం నిర్వహించారు. అనంతరం వంశాచారం ప్రకారం రాజు అయ్యప్ప స్వామిని దర్శించుకుని సేవలో పాల్గొన్నారు. 
 
సేవల అనంతరం స్వామి వారి "తిరువాభరణం" పందళంలోని ఆలయానికి తరలిస్తారు. నాలుగు రోజుల పాటు ప్రయాణించి తిరువాభరణం ఆదివారానికి పందళం చేరుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.