1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్

మకర విళక్కు కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

మండల మకర విళక్కు పూజల కోసం పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయం తెలుపులు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలపులను పూజారులు తెరవనున్నారు. 
 
కానీ, భక్తులను మాత్రం అయ్యప్పస్వామి దర్శననాకి మంగళవారం నుంచి అనుమతించనున్నారు. రెండు నెలలపాటు రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు.
 
డిసెంబర్‌ 26న మండలపూజ ముగుస్తుంది. దీంతో డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు ఆలయాన్ని మూసివేస్తారు. 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వచ్చేఏడాది జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. 
 
జనవరి 20న పడిపూజ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నట్టు ధ్రువపత్రం లేదా మూడు రోజుల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరని అధికారులు స్పష్టంచేశారు.