Telangana Rains: హైదరాబాదులో భారీ వర్షాలు, ట్రాఫిక్.. ఇంటి నుంచే పనిచేయండి...
సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు నవంబర్ 3 నుండి 5 వరకు ఉద్యోగులను ముందుగానే కార్యాలయాల నుండి పంపేలా (early logout) లేదా ఇంటి నుండే పనిచేసే (work-from-home) వెసులుబాటు కల్పించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
వర్ష సూచన దృష్ట్యా, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రయాణంలో ప్రమాదాలను నివారించడానికి, మధ్యాహ్నం 2 గంటల నుండే దశలవారీగా ఉద్యోగులను పంపివేయాలని, వీలైనంత వరకు సాయంత్రం 4 గంటల లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
అలాగే, సాధ్యమైనంత వరకు ఉద్యోగులు ఇంటి నుండే పనిచేసేలా అనుమతించాలని సంస్థలను కోరారు. ఈ చర్యల ఉద్దేశ్యం ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణికుల భద్రతను కాపాడటం, అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడటం.
సంస్థలు తమ కార్యాలయాల వివరాలను, ఉద్యోగులను పంపే సమయాలను (logout timings) సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు [email protected] ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని కోరారు. దీనివల్ల ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడానికి పోలీసులకు వీలవుతుందని పోలీసులు తెలిపారు.

