గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2025 (10:13 IST)

వాష్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న బాలుడు.. కారణం ఏంటి?

suicide
చందానగర్‌లోని రాజేందర్ రెడ్డి కాలనీ సమీపంలో ఒక తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. చందానగర్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్ అంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన బాలుడు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు.
 
సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బాలుడి తల్లి వాష్‌రూమ్‌లో అతన్ని స్పృహలేని స్థితిలో కనుగొనడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అతను పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చిన కొన్ని నిమిషాలకే ఈ సంఘటన జరిగింది. బాత్రూమ్‌కు వెళ్లిన బాలుడు... చాలాసేపటి వరకు అతను బయటకు రాకపోవడంతో, ఆమె తలుపు తట్టి, అతని పేరు పెట్టి పిలిచింది.. అని ఏఎస్ఐ తెలిపారు. 
 
ఆమె తలుపు పగలగొట్టి లోపలికి చూడగా, అతను స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఆమె అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లి, అతని తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 
 
చందానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పాఠశాల యాజమాన్యం స్పందించనందున, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభిస్తామని ఏఎస్ఐ తెలిపారు. ఇప్పటివరకు ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు.