సోమవారం, 16 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 డిశెంబరు 2025 (18:54 IST)

సిడ్నీ ఉగ్రదాడి నిందితుడు సాజిద్ హైదరాబాదీయేనట

terrorists
ప్రపంచాన్ని కుదిపేసిన ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగర ఉగ్రదాడి నిందితుడు సాజిద్‌ది హైదరాబాద్ నగరమేనట. తెలంగాణ డిజిపి కార్యాలయం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. బీకామ్ వరకూ చదివిన ఈ వ్యక్తి 27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడ ఓ యూరోపియన్ యువతిని వివాహం చేసుకున్నాడు. కాగా వలస వెళ్లిన 27 ఏళ్లలో అతడు భారతదేశానికి ఆరుసార్లు మాత్రమే వచ్చి వెళ్లాడు.
 
గమనించాల్సిన విషయం ఏంటంటే... ఇప్పటికీ అతడు భారతదేశానికి చెందిన పాస్ పోర్టునే ఉపయోగిస్తున్నాడు. అతడికి కుమార్తె, కుమారుడు వున్నారు. సాజిద్, ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత అక్కడ నుంచి ఉగ్రవాదులతో పరిచయాలు పెంచుకున్నట్లు తేలింది. ఉగ్ర సంస్థలతో పనిచేయడం చేసాడు. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు హైదరాబాదులో నివాసం వున్న సాజిద్ కుటుంబాన్ని పోలీసులు ప్రశ్నించగా అతడి ఉగ్రవాద చరిత్ర తమకు తెలియదని చెప్పినట్లు సమాచారం. కాగా అతడి గురించి మరింత సమాచారం రాబట్టేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు డిజిపి ఆఫీస్ తెలియజేసింది.