సంబంధిత వార్తలు
- నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు - వారం రోజుల పాటుసాగే ఛాన్స్!!
- సీఎం సార్ కొలువు చేపట్టగానే గుర్తు చేశారు.. ఇపుడు మరిచిపోయారు.. మాజీ డీఎస్పీ నళిని
- రైతు రుణమాఫీ - వరంగల్ సభకు రాహుల్‌కు అహ్వానం : సీఎం రేవంత్ నిర్ణయం
- అమెరికాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... అంతా పట్టణ ప్రజల కోసమే..
- అర్హులైన రైతుల్ని పక్కనబెట్టి రుణమాఫీ సంబరాలా? కేటీఆర్ ప్రశ్న
అపుడు నా వెనుకనే ఉన్నావ్.. నిక్కి నిక్కి చూశావ్.. రేవంత్ రెడ్డిపై హరీష్ ఫైర్ (Video)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత హరీష్ రావు మరోమారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనకు మంత్రి పదవి ఎవరి వల్లనో రాలేదని స్పష్టం చేశారు. ఆనాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము చేరామని, పదవులు కోసం కానేకాదని స్పష్టం చేశారు.
పైగా, తనకు మంత్రి పదవి వచ్చినపుడు టీఆర్ఎస్‌లోనే మీరు ఉన్నారనీ, అపుడు జరిగిన ఊరేగింపులోనూ మీరు పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా మీరు నా వెనకే ఉంటూ, నిక్కి నిక్కి చూశావంటూ దెప్పిపొడిచారు. ఇదంతా మీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావంటూ మండిపడ్డారు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది రెవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది అని అన్నారు. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర మీది అంటూ మండిపడ్డారు. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర మీది, ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా కాకుండా చిల్లరగా మాట్లాడే చీఫ్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నావంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా, గతంలో తన వెనుక రేవంత్ రెడ్డి నిలబడివున్న వీడియోను కూడా హరీష్ రావు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు.
— Harish Rao Thanneeru (@BRSHarish) August 1, 2024
శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు.
నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ ఎస్ లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని… pic.twitter.com/uiU6hqDSPi
తర్వాతి కథనం
