బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2024 (17:43 IST)

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు హర్షణీయం... 1996లోనే ఏబీసీడీలుగా వర్గీకరించాం...

Chandrababu
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన కీలక తీర్పుపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమన్నారు. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. నిజానికి గత 1966లోనే తాము ఎస్సీ వర్గీకరణ చేపట్టి, ఏబీసీడీ అనే ఉప కులాలుగా వర్గీకరించామని ఆయన గుర్తుచేశారు. 
 
శ్రీశైలం వద్ద సున్నిపెంటలో గురువారం సాగునీటి వినియోగదారులతో ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమన్నారు. దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. గతంలోనే వర్గీకరణ చేస్తూ ఏబీసీడీ కేటగిరీలుగా తీసుకొచ్చామని తెలిపారు. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, తమ పార్టీ సిద్ధాం కూడా అదేనని తెలిపారు. 
 
ఎస్టీ ఎస్టీ వర్గీకరణను తాను ఆనాడే ప్రతిపాదించానని తెలిపారు. అందుకే 1996-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులన్నీ బేరీజు చేసిన తర్వాత ఏబీసీడీ కేటగిరీలుగా తానే విభజన చేశానని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత కాలంలో వర్గీకరణ అంశం కోర్టులో విచారణకు వచ్చిందన్నారు. చివరకు సుప్రీంకోర్టులో గురువారం ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం వర్గీకరణకు పచ్చాజెండా ఊపిందని చంద్రబాబు గుర్తు చేశారు.