సంబంధిత వార్తలు
- రాజ్యాంగాన్ని కాపాడాలంటే బలమైన వ్యక్తి కావాలి.. అందుకు సరైన వ్యక్తి రాహుల్ : ఖర్గే
- బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో పురోగతి.. మురికి కాలువలో ఎముకలు లభ్యం!!
- నేడు కొలువుదీరనున్న మోడీ 3.0 సర్కారు : తెలంగాణ నుంచి ఆ ఇద్దరికీ కేబినెట్ బెర్తులు!!
- పడక సుఖం ఇవ్వాలంటూ డైరెక్టర్లు ఒత్తిడి... మహిళా ప్రొఫెసర్ ఆరోపణ
- నరేంద్ర మోడీ 3.0 సర్కారు : తెలంగాణా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు!!
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం : జి.కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డికి కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే మోడీ 3.0 ప్రభుత్వంలో మరోమారు కేంద్ర మంత్రి పదవి వర్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం చేస్తామని ఆయన తెలిపారు. సంకల్పపత్రం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే ఐదేళ్లు అంకితభావంతో పని చేస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణలో గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. రోడ్లు, రేషన్ బియ్యం, గ్రామాలకు మంచినీటి సరఫరా వంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని, రాబోయే రోజుల్లో పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.
రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరిధిలో తన గెలుపు కోసం పని చేసిన పదాధికారులు, మోర్చాల అధ్యక్షులకు ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేసిందని, అయినప్పటికీ ప్రజలు ఆ కుట్రలను తిప్పికొట్టారన్నారు. మోడీ ప్రమాణస్వీకారం పూర్తికాగానే మేళతాళాలతో కార్యక్రమాలను నిర్వహించాలని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారని, రాష్ట్రంలోనూ ఆ కార్యక్రమాలను కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడిగా ఆదేశిస్తున్నట్టు చెప్పారు.
