సంబంధిత వార్తలు
- అమెరికాలో బ్రెయిన్ స్ట్రోక్తో తెలంగాణ యువకుడి మృతి
- వందేభారత్ సెమీ-హై స్పీడ్ రైళ్లకు మూడు డిపోలు
- సోనూసూద్ పేరిట కూరగాయల షాప్.. నెట్టింట వైరల్
- నేను రాష్ట్రాన్ని శాసిస్తున్నా, కావాలనే చిన్నపీటపై కూర్చున్నా: భారాసకి భట్టి కౌంటర్
- సీఎం రేవంత్ భద్రాచలం పర్యటనలో అపశృతి: ఏఎస్పీ పరితోష్ను ఢీకొట్టిన సీఎం కాన్వాయ్
హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి.. మీర్ ఆలం చెరువు మీదుగా..?
హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి రాబోతోంది. చింతల్ మెట్ రోడ్డును బెంగళూరు జాతీయ రహదారితో కలుపుతూ మీర్ ఆలం చెరువు మీదుగా హైదరాబాద్‌కు రెండో తీగల వంతెన త్వరలో రాబోతోంది. రూ.363 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లైన్ల హైలెవల్ వంతెన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
మీర్ ఆలం చెరువుపై నాలుగు లైన్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు తెలంగాణ సీఎంఓకు ధన్యవాదాలు అని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని అంటూ తెలిపారు.
మీర్ ఆలం ట్యాంకు చుట్టూ పనులు చేస్తే జీవనోపాధి మెరుగుపడుతుంది. ఈ కేబుల్ వంతెన ప్రయాణీకులకు కూడా సహాయపడుతుందనడంలో సందేహం లేదు.. అంటూ చెప్పుకొచ్చారు.
