సోనూసూద్ పేరిట కూరగాయల షాప్.. నెట్టింట వైరల్
కరోనాలో కాలంలో ఆపద్భాంధవుడిగా నిలిచిన నటుడు సోనూసూద్.. మళ్లీ వార్తల్లో నిలిచారు. అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఖమ్మంలో ఓ మహిళ సోనూ సూద్ పేరుతో కూరగాయల దుకాణం ప్రారంభించింది.
ఆ దుకాణంలో కూరగాయలు కొన్న వారు షాపు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫొటో వైరల్‌గా మారి సోనూసూద్ వరకూ చేరింది. దీంతో ఆయన ఈ ఫొటోను రీట్వీట్ చేస్తూ.. ఇప్పుడు తనకు కూరగాయల షాప్ కూడా ఉందంటూ కామెంట్ పెట్టారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. టిజన్లు తమ కామెంట్లలో ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా కరోనా కష్ట కాలంలో బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ సొంత డబ్బులు ఖర్చు చేసి సాయం చేశాడు.
అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచాడు. తెరపై విలన్‌గా కనిపించినా నిజజీవితంలో హీరోనని చాటుకున్నారు.