సోమవారం, 20 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 9 సెప్టెంబరు 2023 (19:50 IST)

శరీరానికి ఆరోగ్యాన్ని అందించే 8 రకాల పండ్లు- కూరగాయలు

మనం తినే పండ్లు, కూరగాయలులో కొన్ని ప్రత్యేకమైన పోషక విలువలు కలిగివుంటాయి. వాటిని తింటుంటే పలు అనారోగ్య సమస్యలు దరిచేరవు. అంతేకాదు ప్రయోజనాలను కూడా కలిగి వుంటాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాము. క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడటమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
 
కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. రోజూ పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
 
కీరదోసలో వుండే సిలికాన్, సల్ఫర్ శిరోజాలకు మేలు చేస్తాయి. బీట్ రూట్ తింటుంటే బీపీ అదుపులో వుంటుంది. జామ పండ్లతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.