ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 12 మార్చి 2024 (15:52 IST)

సీఎం రేవంత్ భద్రాచలం పర్యటనలో అపశృతి: ఏఎస్పీ పరితోష్‌ను ఢీకొట్టిన సీఎం కాన్వాయ్

CM Revanth convoy hit ASP Paritosh
మార్చి 11న సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనలో అపశృతి చోటుచేసుకున్నది. భద్రాచలం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) పరితోష్ పంకజ్ సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటన సందర్భంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పరితోష్‌ను మంత్రుల కాన్వాయ్‌లోని వాహనం ఢీకొనడంతో ఆయనకు గాయాలయ్యాయి.
 
ప్రధాన రహదారిపై ఏర్పాట్లు, ట్రాఫిక్‌ను ఆయన పర్యవేక్షిస్తున్న సమయంలో మంత్రుల కాన్వాయ్‌కు చెందిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. గాయపడిన ఏఎస్పీని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. బీహార్‌కు చెందిన పంకజ్ ఐపీఎస్ కాకముందు మర్చంట్ నేవీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.