#JusticeForGeethanjali తెనాలి గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకున్నదా? సోషల్ మీడియాలో భిన్న వాదనలు
మార్చి 7వ తేదీనాడు తెనాలి రైల్వే లైన్ క్రాస్ చేస్తూ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనలో గీతాంజలి(#JusticeForGeethanjali) అనే 30 ఏళ్ల మహిళ తీవ్రగాయాలకు గురైంది. ఆ తర్వాత ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి రెండురోజుల చికిత్స చేసిన అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూసింది. ఆమె చనిపోవడానికి కారణం.. తెదేపా-జనసేన సోషల్ మీడియా ట్రోల్స్ కారణమంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం సాగింది. ఎందుకంటే... జగనన్న ఇల్లు తనకు వచ్చిందన్న సంతోషంతో ఆమె ఓ వీడియోలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కనబడింది.
అంతేకాదు... వచ్చే ఎన్నికల్లో జగనన్నకి ఓటు వేసి గెలిపిస్తామంటూ కూడా చెప్పింది. ఈ నేపధ్యంలో ఆమె 7వ తేదీన రైలు ప్రమాదానికి గురైంది. ఐతే ఇది ప్రమాదం కాదు... ఆత్మహత్య అంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రచారం సాగిస్తోంది. మరోవర్గం ఇదంతా అవాస్తవమనీ, 7వ తేదీనాడు ప్రమాదం జరిగిన నాడే ఈ వార్తలు ఎందుకు రాయలేదని నిలదీస్తోంది.
కనీసం 8వ తేదీనాడైనా రాయాలి కదా అని ప్రశ్నిస్తోంది. ఆమె చనిపోయిన తర్వాత ఆ మహిళ మరణానికి ఫలానా పార్టీలు ట్రోల్స్ కారణమంటూ ఎలా నిర్థారిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరికి తోచినట్లు వారు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేస్తున్నారు. వాస్తవం ఏంటన్నది తెలియాల్సి వుంది.