ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (10:50 IST)

నిర్మించిన సినిమాలు తెచ్చిన కష్టాల వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నారు.. నటి జయసుధ

jayasudha
తన భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోలేదని, తాము నిర్మించిన కొన్ని చిత్రాలు తెచ్చిన కష్టాల కారణంగా ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని సినీ నటి జయసుధ అన్నారు. తాజాగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం అప్పులతో పాటు... ఆయన తీసిన సినిమాలు నష్టాల వల్ల చనిపోయారని వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. 
 
అయినా ఆత్మహత్య చేసుకునేంత అప్పులు మాకు లేవన్నారు. సూసైడ్ చేసుకునే ఒక రకమైన మానసిక స్థితి మా పిల్లలకుగానీ, వాళ్ల పిల్లలకు గానీ రాకూడదనే నేను కోరుకుంటున్నానని అని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడమనేది మా అత్తగారి ఫ్యామిలీ వైపు ఉంది. మా వారి అన్నయ్య, మరో ఇద్దరు మహిళా కుటుంబ సభ్యులు కూడా ఇదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నారని జయసుధ గుర్తుచేశారు. 
 
సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారమవుతుందన్నారు. ఎవరికి తోచింది వాళ్లు రాస్తున్నారని చెప్పారు. అలాంటి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఆయన చనిపోయిన తర్వాత నేను ఆ షాక్ నుంచి బయటకురావడానికి చాలా సమయం పట్టిందన్నారు. మా ఫ్యామిలీ అంతా కూడా సపోర్టు చేయడం వల్ల మాళ్లీ  సినిమాలపై దృష్టి పెట్టడం వల్ల కోలుకోవడం జరిగిందని చెప్పారు.