1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (16:35 IST)

విఘ్నేశ్ శివన్‌ను అన్ ఫాలో చేసిన నయనతార

nayanatara_vignesh
ప్రముఖ హీరోయిన్ నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త విఘ్నేశ్ శివన్‌ను అన్ ఫాలో చేసింది.  ఆమె పేరులో కూడా నయనతార అని మాత్రమే రాసుకుంది. దీని వెనక నయనతార ఉద్దేశం ఏమిటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
 
నయనతార, విఘ్నేశ్ దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2022లో దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులకు ఇటీవలే కవల పిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. ఈ పిల్లల ఫొటోలతోనే నయన్ ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం "టెస్ట్" సినిమాలో నటిస్తున్నారు.