ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (13:47 IST)

త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న తాప్సీ..

Taapsee
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాప్సీ తన బాయ్‌ఫ్రెండ్ మథియాస్ బోను వివాహం చేసుకోబోతోంది. దశాబ్ద కాలంగా వీరిద్దరూ ప్రేమలో వున్నారు. 
 
సిక్కు, క్రిస్టియానిటీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో మార్చి నెలలో వివాహం జరగనున్నట్టు సమాచారం.  
 
తాప్పీ ప్రియుడు మథియాస్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇప్పుడు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 1998లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. డబుల్స్‌లో ఆయన నెంబర్ 1 ర్యాంకును సాధించాడు.