17 నిమిషాల్లో పెళ్లి: వరకట్నం లేదు.. బ్యాండ్ బాజా నో.. ఎక్కడ?
Marriage in 17 Minutes అనే పదం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సంప్రదాయాన్ని మనం ఉత్తరప్రదేశ్, ఆగ్రాలోని సంత్ రాంపాల్ జీ మహరాజ్ ఆశ్రమంలో చూడగలం. ఈ పెళ్ళిళ్ల ప్రధాన ఉద్దేశం వరకట్నంతో పనిలేకుండా 17 నిమిషాల్లో పెళ్లి చేసేయడమే.
ఈ ప్రత్యేక వివాహంలో బ్యాండ్ బాజా, బారాత్ వంటివి ఏవీ ఉండవు. పెళ్లి అత్యంత సాదాసీదాగా జరిగిపోతుంది. వధూవరుల మధ్య కులం, మతం వంటివి ఏవీ అడ్డుగా ఉండవు.
సంపన్నులు, పేదవారు అనే తేడా ఉండదు. కట్నాలు, కానుకల ప్రసక్తే ఉండదు. మేజర్లైన వధూవరులు ఇష్టపడితే చాలు పెళ్లి చేసేసుకోవచ్చు. ఈ పెళ్లిళ్లపై ప్రస్తుతం నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వందలాది వరకట్న రహిత వివాహాలు జరగడంపై వారు మహారాజ్ ఆశ్రమాన్ని కొనియాడుతున్నారు.