గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (15:22 IST)

భర్తను టార్చర్ పెట్టిన భార్య.. వార్నింగ్ ఇచ్చిన కోర్టు.. రూ.5వేలు భరణం

woman
మధ్యప్రదేశ్‌లో ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన కోర్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉజ్జయినికి చెందిన అమన్ మరో యువతి ప్రేమించికున్నారు. 2021లో వీరి పెళ్లి వేడుకగా జరిగింది. కొన్నిరోజులు వీరి కాపురం బాగానే సాగింది. భార్య అతడికి ఇంటికి వెళ్లకూడదని, తల్లిదండ్రులతో మాట్లాడవద్దని టార్చర్ చేసింది. 
 
ఇంట్లో కూడా అనేక రకాలుగా సూటీపోటీ మాటలతో వేధించేది. భార్య టార్చర్ భరించలేక పుట్టింటికి వెళ్లాడు. భార్యపెట్టే టార్చర్‌ను భరించలేక, తన అమ్మనాన్నల దగ్గరకు అమన్ వెళ్లిపోయాడు. దీంతో సదరు యువతి అమన్‌పై పోలీసు కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఫ్యామిలీ కోర్టులో హియరింగ్ వచ్చింది. 
 
ఈ క్రమంలో కోర్టు.. ఇద్దరి తరపు లాయర్ల వాదనలు పరిశీలించింది. అమన్ భార్య.. పెట్టిన కేసులకు, చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి పొంతన లేదని జడ్జీ గుర్తించారు. అంతేకాకుండా అమన్ వేధింపులకు గురిచేసినట్లు కూడ ఎలాంటి ఆధారాలను ఆమె దాఖలు చేయలేదు. ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 
 
సదరు మహిళను మందలిస్తూ.. అమన్ వేధింపులకు గురిచేశాడని ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. పద్దతి మార్చుకొవాలని కూడా మహిళను హెచ్చరించింది. 
 
భర్తను ట్రీట్ చేయాల్సిన విధానం ఇది కాదని కోర్టు చివాట్లు పెట్టింది. అంతే కాకుండా మహిళ భర్త అమన్‌కు ప్రతినెల  ఐదువేలు భరణం చెల్లించాలని కూడా కోర్టు తీర్పునిచ్చింది.