శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (22:21 IST)

మోడల్ తాన్యా సింగ్ ఆత్మహత్య.. అభిషేక్ శర్మకు వాట్సాప్ సందేశం

Tanya singh
Tanya singh
మోడల్ తాన్యా సింగ్ ఆత్మహత్యకు పాల్పడింది. 28 ఏళ్ల తాన్యా సింగ్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ కేసులో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు అభిషేక్ శర్మ పేరు తెరపైకి వచ్చింది. 
 
మోడల్ తాన్యా సింగ్, క్రికెటర్ అభిషేక్ శర్మ మధ్య స్నేహం ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. తాన్యా సింగ్ ఫోన్ నుంచి అభిషేక్ శర్మ ఫోన్‌కు ఓ వాట్సాప్ సందేశం వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. కానీ అభిషేక్ శర్మ నుంచి ఎలాంటి రిప్లయ్ రాలేదు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా అభిషేక్ శర్మను కూడా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. నోటీసులు కూడా పంపనున్నారు.