బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మార్చి 2024 (17:00 IST)

అశ్లీల చిత్రాల నటి సోఫియా లియోన్ ఆత్మహత్య...

Sophia Leone
అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటీమణుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో నటి ప్రాణాలు కోల్పోయింది. అశ్లీల చిత్రాల నటిగా గుర్తింపు పొందిన సోఫియా లియోన్ బలవన్మరణానికి పాల్పడింది. ఆమె తన నివాసంలోనే శవమై కనిపించింది. ఆమె వయసు 26 యేళ్లు. ఆమె ఈ నెల ఆరభంలోనే చనిపోయారు. కానీ, ఈ విషయాన్ని ఆమె సవతి తండ్రి మైక్ రొమెరో వెల్లడించారు. ఈ నెల ఒకటో తేదీన అమెరికాలోని తన అపార్టుమెంటులో 'ప్రతిస్పందించని స్థితి'లో సోఫియా కనిపించినట్టు ఆయన తెలిపారు. క్రౌడ్ ఫండింగ్ సైట్ 'గోఫండ్మీ'లో ఆయనీ విషయాన్ని వెల్లడిస్తూ సోఫియా స్మారకం కోసం నిధులు ఇవ్వాలని కోరారు. ఆమె తల్లి, కుటుంబ సభ్యుల తరపున భారమైన హృదయంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపారు.
 
సోఫియా ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినట్టు తెలిపారు. ఆమె మరణంతో కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నటి మరణానికి గల కారణాలపై పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వివరించారు.
 
సోఫియా మరణవార్తలను ఆమె మోడలింగ్ ఏజెన్సీ '101 మోడలింగ్' కూడా ధ్రువీకరించింది. సోఫియా లియోన్ అకాల మరణం విషాదం నింపిందని, వార్త విని తమ హృదయాలు బద్దలయ్యాయని పేర్కొంది. ఆమెను తాము ఎంతగానో ప్రేమిస్తున్నామని తెలిపింది. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, 'గృహ నిర్బంధ నరహత్య' అని అభివర్ణించింది. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని వివరించింది.