నల్గొండ జిల్లా చెరువుల్లో రాకాసి చేపలు, వలలను కొరికేస్తూ చేపలను తింటూ... వీడియో
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకపర్తి సరస్సులో డెవిల్ ఫిష్ మూక మత్స్యకారులను బెంబేలెత్తిస్తున్నాయి. చేపలు పట్టేందుకు సరసులో వలలు వేస్తుంటే ఆ వలల్ని ముక్కముక్కలుగా కొరికేస్తున్నాయి. మరోవైపు ఇతర చేపలను తినేస్తున్నాయి. దీనితో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని చేపలు పట్టేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సరసులో చేపల వేటకు వెళితే రాకాసి చేపలు దొరుకుతున్నాయి. 3 నుంచి 4 టన్నులు వరకూ ఈ చేపలే పడుతున్నాయి. 100 కుటుంబాలు ఈ చేపల వేట మీద ఆధారపడి వున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో డెవిల్ ఫిష్ కలకలం
— BIG TV Breaking News (@bigtvtelugu) April 20, 2026
చిట్యాల మండలం పెద్దకాపర్తి చెరువులో భారీగా డెవిల్ ఫిష్
వలలను ధ్వంసం చేస్తున్నాయని మత్స్యకారుల ఆందోళన
ఇతర చేపలను తినేస్తున్నాయని వాపోతున్న మత్స్యకారులు
తీవ్ర నష్టం చేస్తున్న డెవిల్ ఫిష్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్
A large number… pic.twitter.com/zNRFGiX0sL

