1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. telangana cm revanth reddy request to pm narendra modi

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy
కేంద్రం చేపట్టాలని భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ట్యాగ్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఎవరూ అడ్డు చెప్పరన్నారు. కానీ, లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. 
 
'లోక్‌సభ సీట్ల పెంపు విషయంపై అఖిలపక్ష భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. లోక్‌సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు వేర్వేరనేది ప్రతి పౌరుడికీ తెలుసు. అసెంబ్లీ సీట్లలో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే దేశం మొత్తం ఆమోదిస్తుంది. మహిళా రిజర్వేషన్ల పేరుతో జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచాలని భారతీయ జనతా పార్టీ చూస్తోంది. దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు ఈ విధానం అన్యాయం చేస్తుంది. భవిష్యత్‌లో దేశాన్ని బలహీనం చేస్తుంది. ఏ పార్టీకైనా జాతీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉండాలి' అని సీఎం పేర్కొన్నారు. 
 
పునర్విభజన పేరుతో రాజ్యాంగంపై దాడి : సోనియా గాంధీ 
 
లోక్‌సభ సీట్లు పెంచేందుకు చేపట్టిన పునర్విభజన ప్రక్రియను రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందనం అధినియమ్ సవరణ బిల్లును కేంద్రం తీసుకునిరానుంది. దీనిపై ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్లు బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే అత్యంత ముఖ్యమని అంశమని ఆమె గుర్తు చేశారు. 
 
'రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై కేంద్రం తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలపై చర్చించేందుకు పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ ప్రతిపాదన గురించి ప్రతిపక్షం ఒకసారి కాదు ఇప్పటికే మూడు సార్లు కేంద్రానికి లేఖ రాసింది. అయినా అందరికీ ఉపయోగపడే ఈ అభ్యర్థనను ప్రధాని తిరస్కరించారు. దానికి బదులుగా ప్రధానమంత్రి సంపాదకీయాలు రాయడం, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తులు చేయడం, ఇతర సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో 'నా మాటే నెగ్గాలి' అన్నట్టు ప్రధాని వ్యవహరించడం విచారకరం. రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల వేళ ఈ అంశాలపై కేంద్రం పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని చూస్తోంది' అంటూ సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు.
 
'లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళా ఎంపీలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే ఆలోచనను ప్రతిపక్షం వ్యతిరేకించడం లేదు. 2027 జనాభా లెక్కలకు ముందు జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. అస్పష్టంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయడం మంచి పద్ధతి కాదు. 'నారీ శక్తి వందన అధినియమ్‌' సవరణ బిల్లును ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరిగే ప్రత్యేక సమావేశానికి బదులుగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశంలోనే తీసుకురావాలి' అని సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
చర్లపల్లి టెక్కీ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ - అత్తమామలు - బామ్మర్ది వేధింపులు తాళలేక...