సంబంధిత వార్తలు
- వంద సంఖ్యకు దిగువకు చేరుకున్న కరోనా మరణాలు
- కేంద్ర బడ్జెట్ 2021 : రక్షణ రంగానికి పెద్దపీట...
- పన్ను శ్లాబుల్లో మార్పులేదు... మరింత పెరగనున్న పెట్రో ధరలు .. తగ్గనున్న బంగారం
- #Budget2021 : ఐటీ రిటన్స్ దాఖలు నుంచి వయో వృద్ధులకు ఊరట
- Budget 2021 Live Updates : రెండు ప్రభుత్వ బ్యాంకులకు మంగళం - ఎల్ఐసీ ప్రైవేటీకరణ
రేషన్ కార్డు దారులకు తపాలాశాఖ సేవలు..
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు తపాలాశాఖ సేవలందించనుంది. ఆధార్‌తో ఐరిస్, ఫోన్ నంబర్ అనుసంధాన సేవలు పొందవచ్చని తపాలాశాఖ పేర్కొంది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 124 ఆధార్ కేంద్రాలు, 15 మొబైల్ కిట్ల ద్వారా సేవలందించనున్నట్లు తెలంగాణ తపాలా సర్కిల్ హైదరాబాద్ రీజియన్ తెలిపింది.
ఆధార్ నంబర్ అప్‌డేషన్‌కు రూ.50, ఐరిస్‌కు రూ.100, రెండింటికీ రూ.100 ఛార్జీ తీసుకోనున్నట్లు పేర్కొంది. మొన్నటి వరకు రేషన్ సరుకుల పంపిణీలో బయోమెట్రిక్ (వేలిముద్ర) తీసుకునే విధానం అమలులో ఉండేది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వేలిముద్రకు బదులుగా ఓటీపీ లేదా ఐరిస్ ద్వారా సరుకుల పంపిణీ ఈ నెల 1న మొదలైంది.
అయితే ఆధార్ సంఖ్యతో మొబైల్ నంబర్ అనుసంధానించి ఉంటేనే ఓటీపీ వస్తుంది. చాలామంది ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ లేకపోవడంతో ఈ తరహా సేవలందించడంపై తపాలాశాఖ దృష్టి సారించింది.