1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Another three are Corona Positive, Karimnagar District Collector Shashanka

ఇవాళ మరో ముగ్గురికి కరోనా పాజిటివ్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక

Another three are Corona Positive
కరీంనగర్ జిల్లా పరిధిలో కరోనా వైరస్ పరిస్థితి గురించి జిల్లా కలెక్టర్ శశాంక వివరించారు. "ఢిల్లీ నిజాముద్దీన్ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో జిల్లా నుండి 19 మందిని గుర్తించాం. వీరిలో అందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి నెగటివ్, ముగ్గురికి పాజిటివ్, మరో ఐదు మంది ఫలితాలు రావాల్సి ఉంది. 
 
జిల్లాలో ఇంకా ఎవరైనా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొన్నవారు ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వారితో సన్నిహితంగా కలిసి తిరిగిన వారున్నా దయచేసి  అధికారులకు సమాచారం ఇవ్వాలి. లేకపోతే వీరి ద్వారా అనేకమందికి వైరస్ సోకే అవకాశం ఉంది. 
 
జిల్లాలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వుంటే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరీక్షలు చేయించుకోవాలి" అని కోరారు. కాగా తెలంగాణలో ఈ రోజు 27 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
ముఖ్యమంత్రికి ఐఎఎస్ అధికారుల సంఘం రూ. 20 లక్షల విరాళం అందజేత