బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 1 ఏప్రియల్ 2020 (23:13 IST)

కరోనా ఫ్రమ్ ఢిల్లీ, నిజామాబాద్ వ్యక్తికి పాజిటివ్...

ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ నగరంలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. ఖిల్లాకు చెందిన షేక్ ముజిబ్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి రావటంతో అతనికి కరోనా పాజిటివ్ వచ్చిoది. 
 
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు షేక్ ముజిబ్. అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా అతని కుమారునికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. 
 
మిగతా ఆరుగురు కుటుంబ సభ్యులకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. మరికొందరి రిపోర్ట్స్ రావాల్సి ఉందని కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.