శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:43 IST)

కరోనా రోగితో టిక్ టాక్ వీడియో, ఎవరు? ఎక్కడ?

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనాను పట్టించుకోకుండా చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రం వేలూరులో జరిగింది.
 
లండన్ నుంచి వచ్చిన ఒక విద్యార్థిని కరోనా లక్షణాలతో తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చేశారు. రికవరీ నిమిత్తం ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉంది. అయితే గతంలో ఆ యువతి టిక్ టాక్‌లో ఫేమస్. 
 
దీంతో టిక్ టాక్ వీడియోలు బెడ్ పైన తరచూ చేస్తూనే ఉంది. దీన్ని గమనించిన పారిశుధ్య కార్మికులు మేము కూడా మీతో కలిసి ఒక టిక్ టాక్ వీడియో చేస్తామన్నారు. ఆ ముగ్గురు పారిశుధ్య కార్మికులకు టిక్ టాక్ పిచ్చి బాగానే ఉంది. దీంతో ఆ అలవాటు మానుకోలేక ఆ యువతితో కలిసి ఒక వీడియో చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. 
 
దీంతో వేలూరు జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ముగ్గురు పారిశుధ్య కార్మికులను వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. వారి రక్తనమూనాలను సేకరిస్తున్నారు.