శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (15:33 IST)

ఢిల్లీలో మహిళా డాక్టర్‌కు కరోనా పాజిటివ్

ఢిల్లీలో ఓ మహిళా వైద్యురాలికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ఈ మహిళా వైద్యురాలు ఢిల్లీ కేన్సర్ ఆస్పత్రిలో పని చేస్తూవస్తోంది. ఈమె ఇటీవలే తన సోదరుడి ఇంటికి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆమెకు కరోనా నిర్ధారణ అయింది. 
 
అయితే వైద్యురాలి సోదరుడు ఇటీవలే యూకే నుంచి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వైద్యురాలికి కరోనా సోకడంతో.. బుధవారం ఆమె పని చేస్తున్న ఆస్పత్రిని మూసివేశారు. ఇక ఆస్పత్రి సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
 
మరోవైపు, ఢిల్లీలో ఇప్పటివరకు 120 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో కరోనా అనుమానిత లక్షణాలతో 750 మంది చేరినట్టు తెలిపారు. ఒక్కరు మాత్రమే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని చెప్పారు. లోక్‌నాయక్‌, రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 1000 పడకలు సిద్ధం చేశామని సత్యేందర్‌ జైన్‌ ప్రకటించారు. 
 
ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విజృంభిస్తున్న‌ది. మంగ‌ళవారం ఒక్క‌రోజే అక్క‌డ కొత్త‌గా 23 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని తెలిపారు. కాగా, కరోనా సోకిన 120 మందిలో ఐదుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యార‌ని, ఇద్ద‌రు మ‌ర‌ణించార‌ని, మ‌రో వ్య‌క్తి విదేశాల‌కు వెళ్లిపోయాడ‌ని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.