శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 31 మార్చి 2020 (22:54 IST)

మొన్న కమలహాసన్, నేడు విజయ్, ఏంటది?

కరోనా వైరస్ తమిళనాడును వణికిస్తోంది. నిన్నటి వరకు 39 పాజిటివ్ కేసులున్న తమిళనాడులో ఇప్పుడు ఏకంగా 74కి చేరింది. అదంతా ఢిల్లీలోని నిజాముద్దీన్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రార్థనలే పుణ్యమే అని కేంద్రం స్పష్టం చేసింది. అయితే తమిళ ప్రజల్లో కూడా తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నాయి.
 
ఇలాంటి పరిస్థితుల్లో రెండురోజుల క్రితం భారతీయుడు2 సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళి వచ్చిన కమలహాసన్ ఇంటికి చెన్నై నగర పాలకసంస్ధ అధికారులు కరపత్రాలను అంటించారు హోమ్ క్వారంటైన్‌లో ప్రస్తుతం కమలహాసన్ ఉన్నారని.. ఎవరూ ఇటు వైపు రాకూడదని హెచ్చరించారు. అది కాస్త తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీసింది.
 
ఇదిలా ఉంటే మరో హీరో విజయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఈరోజు పరీక్షించారు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు. ఈ మధ్యే విజయ్ కూడా విదేశాలకు వెళ్లి వచ్చారు. ఆయన కూడా షూటింగ్ నిమిత్తం వెళ్ళారు. దీంతో ఆయన ఇంటికే వెళ్లిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వారి రక్తనమూనాలను సేకరించారు. 
 
ఉదయం రక్తనమూనాలను సేకరించిన అధికారులు సాయంత్రానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. అయితే జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఏవీ వారిలో లేకపోవడంతో నెగిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.