గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:56 IST)

కరోనా వైరస్, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఏం చేయాలంటే? (video)

కరోనా వైరస్. ఆరోగ్యంగా వున్నవారికి సోకితే, వారు తొలిదశలో గుర్తిస్తే ఆ వైరస్ తో పోరాడి బయటపడవచ్చు. కానీ అనారోగ్య సమస్యలున్నవారికి కరోనా వైరస్ సోకితే దాన్నుంచి బయటపడటం అంత సులభం కాదు.

కరోనా వైరస్ మహమ్మారి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రమాదకరం. కరోనా వైరస్ ఊపిరితిత్తుల పైనా కాకుండా మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది. వైరస్ నోటిలోకి ప్రవేశించిన తర్వాత శరీరంలోని మూత్రపిండాలపైన కూడా ప్రభావం చూపిస్తుందని ఇప్పటికే వైద్యులు నిర్థారించారు.
 
చైనా, దక్షిణ కొరియాలో చాలా మంది నిపుణులు, కరోనా వైరస్ సంక్రమణ తర్వాత కిడ్నీ పాడవడం వల్ల 15-20 శాతం మంది రోగులు తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. కనుక దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు ఈ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలి. ఇలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలను పాటించాలో చూద్దాం.
 
మంచినీరు తాగాలి
మంచి నీరు తాగడం వల్ల మూత్రపిండాలు వైరస్‌ను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. నీటిన తాగుతుండటం వల్ల నోటి ద్వారా వైరస్, బ్యాక్టీరియా చేరినట్లయితే వాటిని జీర్ణాశయంలో వున్న ఆమ్లం నాశనం చేస్తుంది. అలాగే డైట్‌లో విటమిన్ సి వుండేట్లు చూడాలి. డైట్‌లో ఎక్కువ సిట్రస్ పండ్లను చేర్చవచ్చు. ఇది సాధ్యం కాకపోతే, సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.
 
ఆరోగ్యకరమైన ఆహారం
అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకుంటుంటే శరీరం యాంటీబాడీలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలకు కూడా సహాయపడుతుంది. ప్రోబయోటిక్స్ అధికంగా ఉన్న సహజ ఆహార పదార్థాలు, పెరుగు, అల్లం, పసుపు, క్యాబేజీ వంటి యాంటీ ఆక్సిడెంట్లు వున్న ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. కరోనా వైరస్ వంటి వాటితో పోరాడటానికి అది సహాయపడుతుంది.
 
చేతులను శుభ్రంగా కడగాలి
చేతులను సబ్బు, నీటితో 20 సెకన్ల పాటు తరచుగా కడగాలి. రోగకారక క్రిములపై మీ చేతులు పడినట్లయితే ఆ సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. సబ్బు, నీరు అందుబాటులో లేకుంటే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌ను కూడా ఉపయోగించవచ్చు.
 
సామాజిక దూరాన్ని పాటించాలి
ప్రస్తుత సమయంలో తప్పనిసరిగా వ్యక్తులను మరియు సమూహాలను కలవడం మానుకోవాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాలని లేదా ప్రజలను కలవాలంటే సామాజిక దూరాన్ని పాటించడాన్ని మరవవద్దు. ఇది సురక్షితంగా ఉంచుతుంది.