1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Ashada Bonalu to ammavarlu in Hyderabad

హైదరాబాదులో అమ్మవార్లకు ఆషాఢ బోనాలు సమర్పణోత్సవం

Ashada Bonalu
హైదరాబాదులో అమ్మవార్లకు ఆషాఢ బోనాలు సమర్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం 11-30 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఆధ్వర్యంలో బంగారు పాత్రలో బోనం సమర్పించనున్నారు.
 
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కె.మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఏడాది అమ్మవార్లకు జరిగే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఏడు దేవాలయాల అమ్మవార్లకు కమిటీ ఆధ్వర్యంలో ఏడు బంగారు బోనాలను సమర్పిస్తున్నామని తెలిపారు.
 
ఇందులో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, లాల్దర్వాజా సింహవాహిణి, గోల్కొండ, సికింద్రాబాద్, ఉజ్జయినీ మహంకాళి, పెద్దమ్మ దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయ అమ్మవార్లకు సప్త మాతృకల సప్త బంగారం పేరుతో బంగారు బోనాలను సమర్పించడానికి కార్యచరణ రూపొందించామన్నారు.
తర్వాతి కథనం
భార్య, ప్రియురాలితో ఒకేసారి హనీమూన్‌కి వెళ్లిన వ్యక్తి.. చివరికి?