తెలంగాణాలో కరోనా బీభత్సం - రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

telangana
ఠాగూర్|
రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రికార్డుస్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయ. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఈ కేసుల సంఖ్య మరింతగా అధికంగా ఉంది.

ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 1422 కేసులు ఉన్నాయి.

ఓవరాల్‌గా తెలంగాణలో ఇప్పటివరకు 27,612 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏడుగురు మృత్యువాత పడగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 313కి పెరిగింది. ఇవాళ 1506 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 11,012 మంది చికిత్స పొందుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 1422 కేసులు నమోదైతే, రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్‌లో 94, కరీంనగర్‌లో 32, నల్గొండలో 31, నిజామాబాద్‌లో 19, వరంగల్ అర్బన్‌లో 13, పాలమూరులో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి.దీనిపై మరింత చదవండి :