గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: బుధవారం, 8 జులై 2020 (18:51 IST)

కరోనాతో వీధిన పడ్డ హైదరాబాద్ ఆటోడ్రైవర్ల బతుకులు

కరోనా అందరి బతుకులు వీధిన పడేసింది. కోలుకోని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇంటి యజమానుల సతాయింపులు, పైనాన్సియర్ల వేధింపులు భరించలేక చాలామంది మూటాముల్లె సర్దుకొని పల్లెబాట పడుతున్నారు. నిన్నటి వరకూ గౌరవంగా బతికిన వారు కూడా ఇప్పుడు నానా మాటలు పడాల్సి వచ్చింది.
 
సకాలంలో డబ్బులు చెల్లించకపోతే తలదించుకోవాల్సి వస్తుంది. కూలీనాలీ చేసుకునే వారి పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా సృష్టించిన కల్లోలంతో బతుకు చక్రం గాడి తప్పింది. మూడు నెలలు గడిచినా ఇప్పటికీ బతుకు తెరువుకు మార్గం లేదు. ఎంత చదివినా ఉద్యోగాలు లేవు. వ్యాపారాలు చేద్దామంటే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే.
 
ఈ పరిస్థితల్లో కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. దీంతో ఏం చేయాలో ఎలా జీవనాన్ని నెట్టుకొని రావాలో తెలియని పరిస్థితి ఏర్పడింది హైదరాబాదు ఆటోడ్రైవర్లకు.