నాస్తికుడు బైరి నరేష్‌ను మరోమారు చితక్కొట్టిన అయ్యప్ప భక్తులు
కోట్లాది మంది హిందువులు ఆరాధించే శబరిమల అయ్యప్ప స్వామిని కించపరిచేలా, అయ్యప్ప మాలను ధరించే భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన నాస్తికుడు బైరి నరేశ్‌కు భక్తులు మరోమారు దేహశుద్ధి చేశారు. పోలీస్ వాహనం నుంచి కిందకు లాగిమరీ చితక్కొట్టారు. ఈ ఘటన వరంగల్ జిల్లా హన్మకొండలోని గోపాల్ పూర్ ఏరియాలో జరిగింది.
అయ్యప్ప స్వామిని, అయ్యప్ప భక్తులను చులకన చేసి మాట్లాడటంతో జీర్ణించుకోలేని అనేక మంది అయ్యభక్తులు, హిందువులు కలిసి గోపాల్ పూర్ ప్రాంతంలో దాడి చేశారు. అయ్యప్ప స్వామిపై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వెహికల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాహనంలో తరలిస్తుండగా, పలువురు భక్తులు వాహనాన్ని అడ్డుకుని, ఆ వాహనం నుంచి నరేశ్‌ను కిందకులాగి దేహశుద్ధి చేశారు.
దీనిపై నరేశ్ స్పందిస్తూ, తనపై దాడి చేస్తారనే పోలీసుల రక్షణ కోరానని, పోలీసులు వాహనంలో ఉండగానే తనపై దాడి చేశారని చెప్పారు. పోలీసులు వాహనంలో వెళుతుంటే వెంబడించి దాడి చేశారని వాపోయాడు. తనకు గన్‌లైసెన్స్ కావాలని కోరారు.