1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. warangal Medical student preethi calls her mother before attempting suicide

సైఫ్ ఆగడాలు మరీ ఎక్కువైపోయాయమ్మా.... సీనియర్లంతా ఒక్కటయ్యారు.. ప్రీతి ఆవేదన

preethi - saif
వరంగల్ కాకతీయ వైద్య కాలేజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్నం కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు ఆమె తన తల్లికి ఫోన్ చేసి తన ఆవేదన వెళ్లబోసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వెలుగు చూసింది. 
 
"సైఫ్‌ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లంతా ఒక్కటయ్యారు. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా ఫలితం లేకపోయింది. సైఫ్ వేధింపులు మితిమీరిపోతున్నాయి. నేను అతడిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా నన్ను దూరం పెడతారు. ఏదైనా ఉంటే తన వద్దకు రావాలి కానీ ప్రిన్సిపాల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్.ఓ.డి. నాగార్జున రెడ్డి నాపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ అని ప్రీతి తన తల్లితో చెప్పుకుని బాధపడింది. 
 
సైఫ్‌తో తాను మాట్లాడుతానని, సమస్య లేకుండా చూస్తానని ఆమె తన తల్లికి భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ప్రితీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా, ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉంది. 
తర్వాతి కథనం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా!