శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (14:57 IST)

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనీ భర్తను, అత్తను చంపి ముక్కలు చేసిన వివాహిత!

vandana
ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న హత్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యను మరిచిపోకముందే అలాంటి ఘటనే ఒకటి ఇపుడు అస్సాం రాష్ట్రంలో జరిగింది. పరాయి వ్యక్తితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని అడ్డుగా ఉన్నారన్న అక్కసుతో కట్టుకున్న భర్తతో పాటు అత్తను కూడా హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టింది. 
 
అస్సాం రాజధాని గౌహతికి సమీపంలోని నూన్‌మటి ప్రాంతానికి చెందిన వందన కలిత, అమర్ జ్యోతి దే అనే దంపతులు ఉన్నారు. అయితే వందనకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త, అత్త శంకరిదేవిలకు తెలియడంతో వారు వందనను హెచ్చరించారు. పైగా, ఆమె బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో తన ప్రియుడితో కలుసుకోకుండా చేసినందుకు ఆగ్రహించిన వందన.. భర్త, అత్తలను చంపేందుకు నిర్ణయించింది. 
 
ఈ విషయం తన ప్రియుడికి చెప్పగా అతను కూడా సమ్మతించాడు. ఆ తర్వాత ప్రియుడిసాయంతో భర్త, అత్తమాలను చంపేసి మృతదేహాలను ముక్కలు చేసి వాటిని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టింది. మూడు రోజుల తర్వాత వాటిని తీసుకెళ్లి మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి ప్రాంతంలో పడిసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.